devotional news

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

 

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో అనుకోకుండా జరిగే దోషాల నివారణకు ఆగమశాస్త్ర ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

మూడు రోజుల పాటు సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ప్రత్యేక అలంకరణతో నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

ఆర్జిత సేవలు రద్దు

పవిత్రోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 22న సహస్రదీపాలంకార సేవ, ఆగస్టు 23 నుంచి 25 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు కానున్నాయి. ఆగస్టు 25న అష్టదళ పాదపద్మారాధన సేవతో పాటు, ఆగస్టు 26న కల్యాణోత్సవ సేవను కూడా రద్దు చేశారు.

భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

August 12, 2026

 తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనస...

View Post

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

August 12, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవ...

View Post

వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు.. ఆగస్టు 17 నుంచి 19 వరకు వైభవంగా ఉత్సవాలు

August 11, 2026

 వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం...

View Post

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు ముగింపు.. పూర్ణాహుతితో వైభవంగా ముగిసిన ఉత్సవాలు

August 11, 2026

 తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు ...

View Post

కార్వేటినగరంలో ఆగస్టు 25 నుంచి 27 వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య తెప్పోత్సవాలు

August 6, 2026

 టీటీడీ ఆధ్వర్యంలోని కార్వేటినగరం శ్రీ రుక్మి...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 224514