తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు.
📅 వాహన సేవల షెడ్యూల్
🔹 సెప్టెంబర్ 15: సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం
🔹 సెప్టెంబర్ 16: ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి హంస వాహనం
🔹 సెప్టెంబర్ 17: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
🔹 సెప్టెంబర్ 18: ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
🔹 సెప్టెంబర్ 19: ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు గరుడ వాహనం
🔹 సెప్టెంబర్ 20: ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం
🔹 సెప్టెంబర్ 21: ఉదయం సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి చంద్రప్రభ వాహనం
🔹 సెప్టెంబర్ 22: ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
🔹 సెప్టెంబర్ 23: ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు
భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా సెప్టెంబర్ 19న జరిగే గరుడ వాహన సేవ నిలవనుంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉంది. TTD అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
