వారణాసిలో పవిత్ర శ్రావణ మాసం తొలి రోజున కాశీ విశ్వనాథ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావించే నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాశీకి చేరుకుని పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, పర్వదినాల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు ఆలయంలో ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేశారు.
శ్రావణ మాసం మొత్తం కాశీ విశ్వనాథుడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
