devotional news

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

 

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల హరిహరాదులకు, మరీ ముఖ్యంగా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కార్తీక సోమవారాలు, పౌర్ణమి, శివార్చనలు, దీపారాధనలతో భక్తులు ఈ నెలంతా ఆధ్యాత్మిక వాతావరణంలో తరిస్తుంటారు.


ఈ పవిత్ర మాసంలో వారంలోని ఏడు రోజుల పాటు శివలింగానికి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన ద్రవ్యాన్ని లేదా వస్తువును సమర్పించడం వల్ల జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఏ రోజున ఏ గ్రహ శాంతి కోసం శివయ్యకు ఏమి సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


నవగ్రహ అనుగ్రహం కోసం ఏడు రోజుల శివ పూజా విధానం..


సోమవారం (చంద్ర గ్రహం).. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం నాడు శివలింగానికి పాలు, గంగాజలం, బియ్యం, తెల్లటి పూలు, మారేడు దళాలు అంటే బిల్వ పత్రాలు సమర్పించాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.


మంగళవారం (కుజ గ్రహం).. కుజ దోష నివారణ కోసం ఈ రోజున స్వామివారికి ఎర్రటి గులాల్ లేదా ఎర్ర చందనం, ఎరుపు రంగు వస్త్రం, ఎర్రటి పూలు, బెల్లం నైవేద్యంగా సమర్పించడం ఎంతో శ్రేయస్కరం.


బుధవారం (బుధ గ్రహం).. బుధ గ్రహ అనుగ్రహం కోసం శివలింగానికి పెసలు, ఆకుపచ్చని వస్త్రం, తమలపాకులు, ఆకుపచ్చని లేదా సువాసన వెదజల్లే పూలను భక్తితో అర్పించాలి.


గురువారం (గురు గ్రహం)..పనుల్లో ఆటంకాలు తొలగి, గురు బలం పెరగడానికి ఈ రోజున పసుపు, పచ్చి శనగపప్పు, పసుపు రంగు వస్త్రం, పసుపు రంగు పూలతో అంటే బంతి, చామంతి వంటివాటితో   శివయ్యను పూజించాలి.


శుక్రవారం (శుక్ర గ్రహం).. ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల భోగభాగ్యాలు ప్రాప్తించడానికి ఈ రోజున పెరుగు, బియ్యం, తెల్లటి వస్త్రం, శ్వేత పుష్పాలను శివలింగానికి సమర్పించాలి.


శనివారం (శని గ్రహం).. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాల నివారణకు గాను నల్ల నువ్వులు, నువ్వుల నూనె లేదా ఆవనూనె, నల్లటి వస్త్రం, నల్లటి పూలు, మినుములు సమర్పించి ఆ మహాదేవుని ఆరాధించాలి.


ఆదివారం (సూర్య గ్రహం).. ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టల కోసం సూర్య భగవానుడిని స్మరిస్తూ ఈ రోజున ఎర్ర చందనం, ఎర్రటి పూలు, గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు వస్త్రాన్ని పరమేశ్వరునికి సమర్పించాలి.


ఈ విధంగా కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తే జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. కైలాసవాసుని కరుణాకటాక్షాలతో పాటు నవగ్రహాల ఆశీస్సులు లభించి, కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

November 17, 2026

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎà°...

View Post

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

November 17, 2026

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్à°...

View Post

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

November 13, 2026

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రà...

View Post

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

November 12, 2026

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వà°...

View Post

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

November 12, 2026

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేà°...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230429