devotional news

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

 

గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేదీల్లో సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

తిరుపతి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించనున్న విశేషపూజ హోమ మహోత్సవాలు నవంబర్ 11, బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతితో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.

సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పర్యగ్నీకరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపతి హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.

విఘ్నవినాయకుడి అనుగ్రహంతో ఆటంకాలు తొలగి, చేపట్టిన పనులు విజయవంతం కావాలనే సంకల్పంతో ఈ హోమం నిర్వహించారు.

నవంబర్ 12, 13 తేదీల్లో సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

నెల రోజుల విశేషపూజ హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 12, 13 తేదీల్లో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

November 17, 2026

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎà°...

View Post

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

November 17, 2026

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్à°...

View Post

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

November 13, 2026

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రà...

View Post

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

November 12, 2026

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వà°...

View Post

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

November 12, 2026

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేà°...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230404