devotional news

నవంబర్ 8న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

 

ఉదయం ప్రత్యేక పూజలు.. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ
ఆర్జిత సేవల్లో కొన్ని రద్దు చేసిన టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 8వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు.

ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆస్థానం

దీపావళి రోజున ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని స్వామివారికి ఎడమవైపున మరో పీఠంపై దక్షిణాభిముఖంగా కొలువుదీరుస్తారు.

అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం ముగుస్తుంది.

సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ

అదే రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నవంబర్ 8న ఆర్జిత సేవలు రద్దు

దీపావళి ఆస్థానం సందర్భంగా నవంబర్ 8న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

November 17, 2026

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎà°...

View Post

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

November 17, 2026

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్à°...

View Post

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

November 13, 2026

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రà...

View Post

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

November 12, 2026

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వà°...

View Post

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

November 12, 2026

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేà°...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230425