devotional news

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

 


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబరు 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాలు

పవిత్రోత్సవాలకు ముందు ఆలయంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్రాధివాసం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఏడాది పొడవునా జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు

ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే వివిధ క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణ కోసం ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 24న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 25న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 26న పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

భక్తులు ఒక్కొక్కరు రూ.750 చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సేవలో పాల్గొనే గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో హరింద్ర నాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, చెంగల్రాయులు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంతం, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227494