devotional news

చాతుర్మాస దీక్ష ముగింపు ఎప్పుడంటే.. మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలు..!

 

హిందూ సాంప్రదాయంలో 'చాతుర్మాసానికి' అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళతారు. అప్పటినుంచి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే దేవ ఉత్థాన ఏకాదశి వరకు ఉండే శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ నాలుగు నెలల పాటు లోకపాలకుడైన స్వామివారు విశ్రాంతిలో ఉంటారు కాబట్టి.. హిందువులు వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేయడానికి ఆసక్తి చూపరు. కేవలం జపతపాలు, పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక సాధనలకు మాత్రమే ఈ కాలాన్ని కేటాయిస్తారు.


2026లో చాతుర్మాసం ముగింపు ఎప్పుడు..?


ఈ సంవత్సరం జులై 25న ప్రారంభమైన చాతుర్మాస దీక్ష.. నవంబరు 21వ తేదీన ముగియనుంది. నవంబరు 21న స్వామివారు యోగనిద్ర నుంచి మేల్కొనే 'దేవ ఉత్థాన ఏకాదశి' పర్వదినం తర్వాత శుభకార్యాలకు అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది. మీరు కూడా నవంబరు లేదా డిసెంబరు నెలల్లో శుభకార్యాలు తలపెట్టినట్లయితే, ఈ శుభ ముహూర్తాలను పరిశీలించవచ్చు.


నవంబరు 2026లో వివాహ శుభ ముహూర్తాలు..


చాతుర్మాసం ముగిసిన వెంటనే నవంబరు నెలలో వివాహాలకు నాలుగు పవిత్రమైన రోజులు ఉన్నాయి. అవి..


21 నవంబరు 2026 (శనివారం)..ఈ రోజు రేవతి నక్షత్రం ఉంటుంది. ఉదయం 6:44 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 12:08 వరకు మంచి ముహూర్తం ఉంది.


24 నవంబరు 2026 (మంగళవారం)..రోహిణి నక్షత్రం నేపథ్యంలో రాత్రి 11:25 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:47 వరకు వివాహ ముహూర్తం కలదు.


25 నవంబరు 2026 (బుధవారం)..ఉదయం 6:47 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:48 వరకు.


26 నవంబరు 2026 (గురువారం).. ఉదయం 6:48 గంటల నుంచి సాయంత్రం 5:47 వరకు వివాహానికి అనుకూల సమయం.


డిసెంబరు 2026లో పెళ్లి ముహూర్తాలు..


డిసెంబరు నెలలో పెళ్లిపీటలు ఎక్కేందుకు మొత్తం ఏడు అద్భుతమైన రోజులు ఉన్నాయి. ఆ శుభ తేదీలు:


డిసెంబరు 2 (బుధవారం - నవమి, దశమి తిథి)


డిసెంబరు 3 (గురువారం - ఉత్తర ఫల్గుణి/హస్త నక్షత్రం)


డిసెంబరు 4 (శుక్రవారం - ఏకాదశి తిథి)


డిసెంబరు 5 (శనివారం - ద్వాదశి, త్రయోదశి తిథి)


డిసెంబరు 6 (ఆదివారం - త్రయోదశి తిథి)


డిసెంబరు 11 (శుక్రవారం - తృతీయ తిథి)


డిసెంబరు 12 (శనివారం - తృతీయ, చతుర్థి తిథి)


ముఖ్య గమనిక: పెళ్లి ముహూర్తాలు అనేవి ప్రాంతం, అనుసరించే స్థానిక పంచాంగం, కుటుంబ ఆచారాలను బట్టి మారుతుంటాయి. ఇక్కడా పేర్కొన్న తేదీలు సాధారణ పంచాంగ వివరాల ఆధారంగా ఇవ్వబడినవి. వివాహ తేదీని ఖరారు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ వేద పండితులను లేదా సిద్ధాంతులను సంప్రదించి, వధూవరుల జాతకాల ఆధారంగా లగ్న, నక్షత్ర బలాన్ని చూసుకుని కచ్చితమైన ముహూర్తం నిశ్చయించుకోవడం శ్రేయస్కరం.

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227634