devotional news

చంద్రప్రభ వాహనసేవలో కళా వైభవం.. 589 మంది కళాకారుల ప్రదర్శనలు

 


తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనసేవ భక్తిభావంతో పాటు కళా వైభవాన్ని చాటింది. మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు తరలివచ్చిన భక్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్య, సంగీత, జానపద కళారూపాలతో అలరించారు.

10 రాష్ట్రాల నుంచి 22 కళాబృందాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 22 కళాబృందాల్లో 589 మంది కళాకారులు చంద్రప్రభ వాహనసేవలో పాల్గొన్నారు.

భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, నెమలినాట్యం, శ్రీకృష్ణ లీలలు, కోయ నృత్యం, కథక్, లెజుమ్, రాయ్ చంద్, తిప్పని హూడో, కీలుగుర్రాలు తదితర కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కర్ణాటకకు చెందిన కళాకారులు పురందరదాసుల దేవరనామాలతో భక్తిభావాన్ని పంచగా, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కళాకారులు భజనలు నిర్వహించారు. మచిలీపట్నం కళాకారులు శ్రీవేంకటేశ్వర వైభవం నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.

కళారూపాలతో భారతీయ సంస్కృతి వైభవం

వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళారూపాల ద్వారా శ్రీవారిపై భక్తిని చాటడంతోపాటు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల వైభవాన్ని ఆవిష్కరించారు.

చంద్రప్రభ వాహనసేవను తిలకించిన భక్తులు కళాబృందాల ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించి ఆనందించారు.

పలు కళాబృందాలకు టీటీడీ ఈవో సన్మానం

చంద్రప్రభ వాహనసేవలో పాల్గొన్న పలు కళాబృందాలను టీటీడీ ఈవో సన్మానించారు.

  • హిందూ ధర్మ ప్రచార పరిషత్ – ఉత్తరాఖండ్: శ్రీమతి స్వాతి జగ్గీ బృందం – నందా రాజ్ జాతర యాత్ర – 15 మంది

  • దాస సాహిత్య ప్రాజెక్టు – గుజరాత్: శ్రీ తేజస్ యాదవ్ బృందం – గర్బా జానపద నృత్యం – 24 మంది

  • ఎస్వీ సంగీత, నృత్య కళాశాల – తిరుపతి: శ్రీ సి. హరనాథ్ బృందం – భరతనాట్యం – 25 మంది

  • అన్నమాచార్య ప్రాజెక్టు – కడప: శ్రీ బాబు బృందం – డ్రమ్స్ ప్రదర్శన – 16 మంది


తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227500