devotional news

బోడుప్పల్‌లో మారుమోగిన “మారుతీ” నినాదాలు.. గాయత్రి మాత ఆలయంలో భక్తుల పూనకాలు!


మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్‌లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల సుధాకర్, జనరల్ సెక్రటరీ నందకుమార్ జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.





Read Also This:
రుద్రాక్షమాలను ఎలాంటి వారు ధరించకూడదు..? నియమాలు ఏంటి..?

వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తులు ఏకస్వరంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి.

అనంతరం అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి భక్తులకు సింధూర తిలకం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం

June 27, 2026

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ ...

View Post

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం ప్రారంభం – ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు పెద్దపీట

June 9, 2026

విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర...

View Post

తిరుమలలో 90 వేల మంది భక్తులు – రూ.4 కోట్ల హుండీ ఆదాయం - TTD Updates

June 8, 2026

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు ...

View Post

Nellore Rottela Panduga 2026: జూన్ 26 నుంచి రొట్టెల పండుగ ప్రారంభం – ఏర్పాట్లు వేగవంతం

June 8, 2026

నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్...

View Post

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 173122