devotional news

దేవీ నవరాత్రులు: సింహద్వారంపై ఈ 4 మంగళప్రదమైన చిహ్నాలు ఉంచితే సకల శుభాలు..!

 

శరన్నవరాత్రుల వేళ జగన్మాత ఆరాధనతో లోకమంతా భక్తిభావంతో పులకిస్తుంది. దుర్గాదేవి నవ రూపాలను నిష్టతో ఆరాధించే తొమ్మిది రోజులూ ప్రతి ఇల్లూ ఓ పవిత్ర దేవాలయంగా మారుతుంది. అయితే, నవరాత్రులలో పూజా గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఇంటి సింహద్వారానికి అంటే ప్రధాన ద్వారం కూడా అంతే విశిష్టత ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి, దుర్గామాత అనుగ్రహం కలగాలంటే అమ్మవారి రాకకు సూచికగా ఉండే ప్రవేశ ద్వారం శుభప్రదంగా ఉండాలి. నవరాత్రుల ప్రారంభ దినాన ఇంటి ముఖద్వారంపై తీర్చిదిద్దాల్సిన 4 అత్యంత పవిత్రమైన మంగళ చిహ్నాలు, వాటి ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఇప్పుడు  తెలుసుకుందాం..


1. ఓంకార నాదం – దివ్య చైతన్యం..సమస్త సృష్టికి మూలమైన ప్రణవ నాదం 'ఓంకారం'.  సింహద్వారం పైభాగంలో కుంకుమ లేదా పసుపుతో 'ఓం' చిహ్నాన్ని తీర్చిదిద్దాలి. ఓంకారం సానుకూల తరంగాలను ప్రసరింపజేస్తుంది. ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచి, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని చేకూరుస్తుంది.


2. స్వస్తిక చిహ్నం – సర్వ విఘ్న నివారిణి..


సనాతన ధర్మంలో స్వస్తిక అంటే 'క్షేమము, శుభము'. ఏ శుభకార్యానికైనా స్వస్తిక ముద్ర వేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. విధానం..ద్వారబంధానికి కుడి, ఎడమ వైపులా పసుపు, సింధూరం లేదా కుంకుమతో స్వస్తిక ముద్రలు వేయాలి.

ఫలితం.. ఇది దృష్టి దోషాలను, ప్రతికూల శక్తులను పారద్రోలి, గృహంలోకి మంగళకరమైన శక్తులను ఆహ్వానిస్తుంది.


3. పూర్ణకుంభం (కలశం)- సిరిసంపదల ప్రతీక..


నవరాత్రులలో కలశ స్థాపనకు విశేష ప్రాధాన్యత ఉంది. కలశం త్రిమూర్తులు, సకల దేవతల నివాసంగా, సంపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు.


విధానం..సింహద్వారం ఇరువైపులా కలశ చిహ్నాన్ని గంధం, కుంకుమలతో రంగులద్దవచ్చు లేదా పసుపుతో చిత్రించవచ్చు.


ఫలితం..ముఖద్వారం వద్ద కలశ రూపం ఉండటం వల్ల గృహంలో ఐశ్వర్యం, ధాన్య సమృద్ధి, ఆయురారోగ్యాలు స్థిరంగా ఉంటాయని విశ్వాసం.


4. శ్రీ మహాలక్ష్మి పాదాలు – ఐశ్వర్య ప్రాప్తి..


నవరాత్రుల పర్వదినాల్లో ఆదిపరాశక్తిని మహాలక్ష్మి స్వరూపంగానూ పూజిస్తాం. అమ్మవారి చరణాలు ఇంట్లో పడితే దరిద్రం పటాపంచలవుతుంది.


విధానం..బియ్యపు పిండి, పసుపు లేదా సహజ సిద్ధమైన రంగులతో అమ్మవారి పాదముద్రలను గీయాలి. ముఖ్య గమనిక: పాదాలు బయట నుంచి ఇంటి లోపలికి నడిచి వస్తున్నట్టుగా మాత్రమే వేయాలి.


ఫలితం..లక్ష్మీదేవి తన సకల కళలతో గృహ ప్రవేశం చేస్తుందనడానికి ఇది సూచిక. నిరంతరం సుఖసంతోషాలు కొలువై ఉంటాయి.


తోరణాలు, పరిశుభ్రత-శాస్త్ర నియమం..


ఈ పవిత్ర చిహ్నాలను అలంకరించే ముందు ముఖ్య ద్వారం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఉదయాన్నే గడపను శుభ్రంగా కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రవేశ మార్గంలో ఎలాంటి మురికి లేదా నిరుపయోగ వస్తువులు లేకుండా చూసుకోవాలి.


మామిడి తోరణం..ద్వారానికి పచ్చని మామిడి ఆకులు, బంతిపూలతో తోరణం కట్టడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాక, సాక్షాత్తూ దేవతలు ఆ గృహాన్ని ఆశీర్వదిస్తారని పురాణోక్తి.

భక్తి, శ్రద్ధలతో సింహద్వారాన్ని శుభప్రదంగా తీర్చిదిద్ది నవరాత్రులను ప్రారంభించడం వల్ల ఆ జగన్మాత అనుగ్రహం మన గృహంపై నిరంతరం వర్షిస్తుంది.

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

November 17, 2026

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎà°...

View Post

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

November 17, 2026

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్à°...

View Post

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

November 13, 2026

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రà...

View Post

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

November 12, 2026

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వà°...

View Post

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

November 12, 2026

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేà°...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230446