devotional news

మాస శివరాత్రి విశిష్టత.. ఈశ్వరునికి పూజ చేసే విధానం, నియామాలు మీకోసం..

 

హిందూ సాంప్రదాయంలో ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు వచ్చే మాస శివరాత్రికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే మహా శివరాత్రి ఎంత పవిత్రమైనదో, ప్రతి నెలా వచ్చే ఈ తిథి పరమశివుడి అనుగ్రహాన్ని పొందడానికి అంతే శ్రేష్ఠమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. లయకారుడైన శివుడిని, ఆదిపరాశక్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించే భక్తులకు ఈ రోజు సకల శుభాలను చేకూరుస్తుంది.


ఆధ్యాత్మిక ప్రాధాన్యం..మనశ్శాంతి..ఇంద్రియ నిగ్రహం.. చంద్రుడు మనస్సుకు కారకుడు. కృష్ణ పక్ష చతుర్దశి నాటికి చంద్రుని కళలు కనిష్ఠ స్థాయికి చేరతాయి. ఈ సమయంలో ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతతను పొంది, చంచలత్వం తగ్గుతుంది. జాతకంలో చంద్ర, శని దోషాలు ఉన్నవారు మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేష ఉపశమనం పొందుతారని జ్యోతిష్య విశ్వాసం. భోళాశంకరుని నామస్మరణతో రోజంతా గడిపి, రాత్రివేళ లింగోద్భవ కాలంలో పూజించడం వల్ల జన్మజన్మాంతరాల కర్మ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.


పూజా విధానం, నియామాలు..ఉపవాస దీక్ష.. ఉదయాన్నే శుచిగా స్నానమా చరించి, శివారాధన తో ఉపవాస సంకల్పం చేయాలి. రోజంతా సాత్విక ఆహారం లేదా ఫలహారంతో దీక్ష కొనసాగించ వచ్చు. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో మహాన్యాస లేదా పంచామృత అభిషేకం నిర్వహించాలి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు, విభూతి, తెల్లని పూలతో అర్చించి, దీపారాధన చేయాలి. రాత్రి వేళ "ఓం నమః శివాయ" పంచాక్షరీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం లేదా శివ తాండవ స్తోత్రం పఠిస్తూ శివ ధ్యానంలో గడపడం శ్రేయస్కరం. నిష్కల్మషమైన భక్తితో ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పించినా ప్రీతి చెందే భోళా శంకరుని కృపతో జీవితంలోని ఆటంకాలు తొలగి, కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.


అభిషేక ద్రవ్యాలు - ఆధ్యాత్మిక ఫలితాలు..


శివుడు అభిషేక ప్రియుడు. "అలంకార ప్రియో విష్ణుః, అభిషేక ప్రియః శివః" అంటారు. మాస శివరాత్రి పర్వదినాన లింగాకారంలో వెలసిన పరమేశ్వరుడికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని శివపురాణం పేర్కొంటోంది. శివారాధనలో అభిషేకానికి అత్యున్నత స్థానం ఉంది. లింగాకార పరమేశ్వరునికి సమర్పించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్ట ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుందని పురాణాలు విశదీకరిస్తున్నాయి. పవిత్రమైన శుద్ధ జలం లేదా గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడిని పూజిస్తే ఆయుష్షు వృద్ధి చెందడంతో పాటు సర్వసౌఖ్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయి. అలాగే ఆవు పెరుగుతో చేసే అభిషేకం శారీరక బలాన్ని, ఉత్తమ ఆరోగ్యాన్ని, వాహన ప్రాప్తిని ప్రసాదిస్తుంది. తీవ్ర అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందేందుకు, దీర్ఘాయువు, పరమ మోక్షాన్ని సాధించేందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.


తేనెతో భోళాశంకరుని అర్చిస్తే దారిద్య్రం సమసిపోయి ముఖవర్చస్సు, వాక్చాతుర్యం, మధుర సంభాషణా శక్తి పెంపొందుతాయి. చెరకు రసంతో అభిషేకించడం ద్వారా విశేష ధనప్రాప్తి, శత్రువులపై విజయం, నిరంతర లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి. పరమేశ్వరుని స్వరూపమైన విభూతితో పూజిస్తే భయాలు నశించి, సకల పాపాలు హరించి జ్ఞాన సిద్ధి అలవడుతుంది. చందనం సమర్పించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, ఆకర్షణ శక్తి, సౌభాగ్యం లభిస్తాయి. కొబ్బరి నీళ్లతో స్వామిని అభిషేకించడం కుటుంబంలో ప్రశాంతతను, వంశాభివృద్ధిని చేకూరుస్తుంది. నువ్వుల నూనెతో తైలాభిషేకం జరిపించడం వలన అపమృత్యు భయాలు, తీవ్రమైన శని దోషాలు తొలగిపోయి గ్రహ శాంతి చేకూరుతుంది.  నియమాలు.. 


ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా, చివరగా మారేడు దళాలు సమర్పించడం తప్పనిసరి. మారేడు దళం లేని శివపూజ పరిపూర్ణం కాదు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపిన పంచామృతంతో అభిషేకం చేస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయి.

ద్రవ్యం ఏదైనా, నిష్కల్మషమైన భక్తితో శివ పంచాక్షరీ మంత్రం "ఓం నమః శివాయ" జపిస్తూ చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది.

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227531