devotional news

శని సంచారం వల్ల ఈ రాశుల వారికి అదృష్టయోగం మామూలుగలేదు..

 

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి శని దేవుడికి దాదాపు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. మందగమనుడైన శని ప్రభావం వ్యక్తుల జీవితాలపై దీర్ఘకాలం పాటు ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న శని.. 2027 జూన్ 3వ తేదీన మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, అప్పటి వరకు మీన రాశిలో శని సంచారం వల్ల కొన్ని రాశుల వారిపై శని దేవుని విశేష కృపాకటాక్షాలు ఉండనున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయాలతో పాటు ధన లాభం, వివాహ యోగం వంటి అద్భుత ఫలితాలు పొందే ఆ అదృష్ట రాశులేమిటో పరిశీలిద్దాం.


వృషభ రాశి..


కెరీర్‌కు సంబంధించి మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి.వృత్తిపరంగా ఉన్నత స్థానాలకు ఎదగడానికి నూతన అవకాశాలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. కుటుంబంలోకి కొత్త వ్యక్తుల రాకతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అవివాహితులకు వివాహ యోగం సిద్ధిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది.


కన్యా రాశి..


ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సుదూర ప్రాంతాలకు లేదా పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృత్తిపరంగా మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.

వ్యాపారస్తులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో లాభాలకు బాటలు వేస్తాయి.కళారంగంలో ఉన్నవారి ప్రతిభ వెలుగులోకి వచ్చి, మంచి ప్రశంసలు దక్కుతాయి.


మకర రాశి..


ఉద్యోగంలో మీరు కోరుకున్న విజయాలు సాధిస్తారు. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక స్థితి మునుపటి కంటే బలోపేతం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.తలపెట్టిన ముఖ్యమైన పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు.


కుంభ రాశి..


దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మీరు ఊహించిన దానికంటే మంచి లాభాలు గడిస్తారు.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు, నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాలు సానుకూలంగా పూర్తవుతాయి.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227658