devotional news

పితృపక్షం ప్రారంభం.. ఈ 15 రోజులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..!

 

హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  నేటి నుంచి అంటే సెప్టెంబర్ 26, 2026 నుంచి పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. ఈ పదిహేను రోజులు పూర్వీకులను స్మరించుకుంటూ, వారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, పిండప్రదానాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మన ఆచారం. ఈ ప్రత్యేక కాలంలో పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఆహారపు అలవాట్లతో పాటు దైనందిన జీవితంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృపక్ష సమయంలో ఏయే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.


1. సాత్విక ఆహారమే ఉత్తమం..


పితృపక్ష కాలంలో ఆహార విషయంలో ఎంతో నిష్ట పాటించాలి. ఈ రోజుల్లో పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు, అతిగా నూనె-కారం ఉండే వంటకాలకు దూరంగా ఉండాలి. శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకునేలా సాదాసీదా భోజనాన్ని అలవాటు చేసుకోవాలి.


2. గోళ్లు, జుట్టు కత్తిరించుకోకపోవడం..


శ్రాద్ధ పక్షం అనేది సంయమనానికి, పూర్వీకుల పట్ల అపారమైన గౌరవానికి ప్రతీక. అందుకే ఈ పదిహేను రోజుల పాటు క్షౌరకర్మలు అంటే గోళ్లు, జుట్టు కత్తిరించుకోవడం చేయించుకోకూడదని మత విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ కాలంలో వీలైనంత సాదాసీదా జీవితాన్ని గడపాలని పెద్దలు సూచిస్తారు.


3. కొత్త పనులు, శుభకార్యాలకు దూరం..  


పితృపక్ష సమయంలో ఎలాంటి కొత్త పనులు, శుభకార్యాలు ప్రారంభించకూడదు. గృహప్రవేశాలు, వివాహాలు, మునుల వంటి శుభకార్యాలతో పాటు కొత్త వస్తువుల కొనుగోళ్లు, పెద్ద ప్రయాణాలను ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది. ఈ పూర్తి కాలాన్ని కేవలం పితృదేవతల స్మరణకు, దానధర్మాలకు మాత్రమే అంకితం చేస్తారు.


4. పంచగ్రాస నిబంధన..


పితృపక్షంలో భోజనం చేసే ముందు ఆహారంలో కొంత భాగం గోవు , కుక్క, కాకి, దేవతలు, చీమల కోసం ప్రత్యేకంగా తీసి ఉంచాలి. దీనినే 'పంచగ్రాస' లేదా 'పంచబలి' అంటారు. ఈ విధంగా జీవజంతువులకు ఆహారం పెట్టడం ద్వారా పూర్వీకుల పట్ల మన కృతజ్ఞతను తెలుపుతామని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.


5. తర్పణాలు, శ్రాద్ధ కర్మలు..


ఈ పక్షం రోజుల్లో పూర్వీకుల తిథిని బట్టి వారిని స్మరిస్తూ శ్రాద్ధం, పిండ ప్రదానం, దానాలు చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలుగుతుందని ప్రతీతి. శ్రద్ధాభక్తులతో చేసే ఈ కార్యాల వల్ల పితృదేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయని ధర్మశాస్త్రం చెబుతోంది.

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

November 17, 2026

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎà°...

View Post

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

November 17, 2026

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్à°...

View Post

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

November 13, 2026

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రà...

View Post

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

November 12, 2026

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వà°...

View Post

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

November 12, 2026

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేà°...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230447