గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View Post
దైవ దర్శనం కోసం వెళ్ళినప్పుడు గుడి బయట వదిలిన పాదరక్షలు కనిపించకపోతే ఎవరికైనా బాధ కలగడం సహజం. కొందరు దీనిని అపశకునంగా భావిస్తారు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆలయం వద్ద చెప్పులు పోవడం వెనుక ఒక సానుకూల సందేశం దాగి ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగితే మీ కష్టాలు తీరబోతున్నాయని ప్రకృతి పంపిస్తున్న సంకేతం అంటున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం..
పాదరక్షలు - శని భగవానుడి ప్రభావం..మనిషి శరీరంలోని పాదాలకు, అలాగే మనం ధరించే బూట్లు, చెప్పులకు శని దేవుడు కారకుడిగా ఉంటాడు. జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
దోష నివారణ.. ఆలయం వంటి పవిత్ర స్థలంలో పాదరక్షలు అపహరణకు గురవ్వడం అంటే, ఆ వ్యక్తిని అంటిపెట్టుకున్న శని దోషం లేదా ప్రతికూల శక్తి విడిచి వెళ్ళిందని అర్థం. ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగితే, త్వరలోనే మీ జీవితంలో ఉన్న దుఃఖాలు తొలగిపోయి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని సంకేతం.
సాధారణంగా శని దోషం ఉన్నవారు లేదా ఏలిననాటి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు శనివారాల్లో పాదరక్షలను దానం చేయాలని శాస్త్రం చెబుతోంది.కొందరు తెలియకనో లేదా ఇతర కారణాల వల్లనో దానం చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆలయం బయట చెప్పులు పోవడాన్ని 'అప్రయత్న దానం'గా పరిగణించవచ్చు. మీ కష్టాలను ఆ చెప్పుల రూపంలో ఎవరో తీసుకెళ్లారని భావించి ప్రశాంతంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యక్తిత్వంపై పాదరక్షల ప్రభావం..మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడంలో పాదరక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్య రీత్యా కూడా చెప్పుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బూట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, పాలిష్ చేసి ఉండాలి. మురికిగా ఉన్న పాదరక్షలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఎట్టిపరిష్టితుల్లోనూ చిరిగిన లేదా పాడైపోయిన చెప్పులను ధరించడం మంచిది కాదు. ఇది చేసే పనుల్లో ఆటంకాలను సృష్టిస్తుంది. చాలామంది గుడిలో ఉన్నంత సేపు దేవుడి కంటే బయట ఉన్న తమ చెప్పులు లేదా బూట్లపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. కానీ, ప్రకృతి సిద్ధంగా జరిగే ఇటువంటి సంఘటనలు మీ మంచికే అని గ్రహించాలి. పాదరక్షల పోకడను ఒక నష్టంగా కాకుండా, శని దేవుడి అనుగ్రహంగా భావించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
భక్తి మార్గంలో వెళ్లేటప్పుడు ఇష్టమైన వస్తువులపై మోహం వదులుకోవాలనేది ఒక కోణమైతే, జ్యోతిష్య రీత్యా అది దోష నివారణకు మార్గమని మరో కోణం. కాబట్టి, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మీ చెప్పులు పోతే ఆందోళన చెందకండి.. మీ కష్టాలు తీరబోతున్నాయని నవ్వుతూ ముందుకు సాగాలని పండితులు చెబుతున్నారు.
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View PostJune 9, 2026
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర...
View PostJune 8, 2026
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 90,000 మంది భక్తులు శ్ర...
View PostJune 8, 2026
నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం Rottela Panduga (రొట్టెల పండుగ). ఇది ప్రధానంగా Bara Shaheed Dargah వద్ద నిర్వహించబ...
View PostJune 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View Post