గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View Post
వైశాఖ శుక్ల పక్ష తదియ... 'అక్షయ తృతీయ'. పేరుకు తగ్గట్టే ఈ రోజున చేసే ఏ చిన్న శుభకార్యమైనా, దానధర్మమైనా అక్షయమై ఫలితాన్నిస్తుందని శాస్త్ర వచనం. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం, దారిద్ర్య నిర్మూలన కోసం ఈ పవిత్రమైన రోజున ఆచరించాల్సిన విశిష్ట దానాల విశేషాలు మీకోసం..
ఏప్రిల్ 19వ తేదీ, 2026..హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది (ఏప్రిల్ 19వ తేదీ, 2026 నాడు వచ్చే ఈ పర్వదినం సంపదకు, శ్రేయస్సుకు మూలమని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ రోజున చేసే 'రహస్య దానాలు' జాతక దోషాలను తొలగించి, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తాయని నమ్ముతారు.
ఏమి దానం చేయాలి అంటే..?జల పాత్రలు అంటే ఉదకుంభ దానం : ఎండలు మండిపోయే ఈ కాలంలో దాహార్తిని తీర్చడం పరమ పుణ్యం. నీటితో నిండిన మట్టి కుండను లేదా కలశాన్ని దానం చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది.
సత్తుపిండి,బెల్లం...ఆరోగ్య రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా సత్తుపిండిని దానం చేయడం శ్రేష్ఠం. ఇది పేదరికాన్ని దూరం చేసి, వ్యాపార వృద్ధిని కలిగిస్తుంది.
విసనకర్రలు..వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే విసనకర్రలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
శనగపప్పు..బంగారం కొనలేని వారు శనగపప్పును దానం చేయవచ్చు. ఇది గురు గ్రహ అనుగ్రహాన్ని ప్రసాదించి, బంగారమంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.
పాదరక్షలు, గొడుగులు..పేదలకు గొడుగు లేదా చెప్పులను దానం చేయడం వల్ల రాహు-కేతువుల దుష్ప్రభావాలు తగ్గి, ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది.
దాన నియమాల ప్రకారం ఇవి గుర్తుంచుకోండి..!పాత్రమెరిగి దానం చేయాలి.. అది ఆడంబరంగా కాకుండా అంతరంగ శుద్ధితో ఉండాలి. గుప్త దానం అంటే.. కుడి చేయి చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. ప్రశంసల కోసం కాకుండా నిస్వార్థంగా చేసే దానమే అత్యంత శక్తివంతమైనది.
అభిజిత్ ముహూర్తం..పూజలు, దానాలు చేయడానికి అక్షయతృతీయ రోజున వచ్చే అభూజ ముహూర్తం లేదా అభిజిత్ ముహూర్తం అత్యంత ఫలవంతమైన సమయం.అయిష్టంగా ఇచ్చే దానం ఫలితాన్నివ్వదు. కాబట్టి గ్రహీత పట్ల గౌరవంతో, సంతోషకరమైన మనసుతో దానం చేయాలి. పాడైపోయిన వస్తువులు లేదా మాంసాహార సంబంధిత వస్తువులను దానం చేయకూడదు. ఈ అక్షయ తృతీయ నాడు మీ శక్తి కొలది దానధర్మాలు చేసి, ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులు అవ్వాలని పండితులు సూచిస్తున్నారు.
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View PostJune 9, 2026
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర...
View PostJune 8, 2026
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 90,000 మంది భక్తులు శ్ర...
View PostJune 8, 2026
నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం Rottela Panduga (రొట్టెల పండుగ). ఇది ప్రధానంగా Bara Shaheed Dargah వద్ద నిర్వహించబ...
View PostJune 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View Post