గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View Post
సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినా, కొత్త పని ప్రారంభించినా మనం కొబ్బరికాయ కొడతాం. భక్తితో దేవుడిని ప్రార్థిస్తాం. కానీ ఒక చోట మాత్రం కొబ్బరికాయ కొడితే చాలు.. అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఇండోనేషియాలోని ఓ తెగ వారు శతాబ్దాలుగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆధ్యాత్మికతకు, అపనమ్మకానికి మధ్య వారధిగా నిలిచే ఆ ఆచారం విశేషాలేంటో చూద్దాం..
లేవాక్ టపో'.. రహస్య ఆచారం..ఇండోనేషియాలోని తూర్పు నుసా తెంగారా ప్రాంతంలో నివసించే 'లమహోలోట్' తెగ ప్రజల ఆచారం ఇది. వీరు తూర్పు ఫ్లోరెస్, లెంబటా జిల్లాల్లోని ద్వీపాల్లో నివసిస్తుంటారు. వీరు తమ పూర్వీకుల ఆత్మలతో సంభాషించడానికి, దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి 'లేవాక్ టపో' అనే సంప్రదాయాన్ని నిర్వహిస్తారు.
టపో అంటే ఏమిటి..?లమహోలోట్ భాషలో 'టపో' అంటే కొబ్బరికాయ అని అర్థం. ఈ ఆచారంలో కొబ్బరికాయే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సహజ మరణాల కంటే.. ప్రమాదాలు, హత్యలు లేదా చిన్న వయసులో సంభవించే అసహజ మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడమే ఈ ఆచారం ముఖ్య ఉద్దేశం.
పూర్వీకులు చేసిన పాపాలు శాపాలుగా మారి తర్వాతి తరాలకు తగులుతాయని వీరి నమ్మకం. ఎవరైనా అకాల మరణం చెందితే, ఆ పాపమేంటో తెలుసుకుని భవిష్యత్తు తరాలను కాపాడుకోవడానికి ఈ పూజ చేస్తారు.
ఈ తెగలో ఆధ్యాత్మిక నాయకుడిని 'షామన్' అని పిలుస్తారు. అసహజ మరణం సంభవించినప్పుడు, షామన్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయను పగలగొడతాడు. కొబ్బరికాయ పగిలిన తీరును బట్టి మరణానికి గల అసలు కారణాన్ని షామన్ వివరిస్తాడు. ఆ మరణానికి కారణం పూర్వీకుల శాపమని లేదా దేవుడి ఆగ్రహమని తెలిసిన వెంటనే, అక్కడున్న వారంతా గట్టిగా ఏడవడం ప్రారంభిస్తారు. ఆ ఏడుపు ద్వారా తమ తప్పులను క్షమించమని, మృతుని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటారు.
ప్రపంచీకరణ పుణ్యమా అని ఎన్నో తెగలు కనుమరుగవుతున్నా, లమహోలోట్ ప్రజలు మాత్రం తమ ప్రాచీన నమ్మకాలను నేటికీ వదలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. బయటి ప్రపంచానికి ఇది వింతగా అనిపించినా, వారికి మాత్రం ఇది వారి సంస్కృతిలో ఒక భాగం.
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View PostJune 9, 2026
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర...
View PostJune 8, 2026
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 90,000 మంది భక్తులు శ్ర...
View PostJune 8, 2026
నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం Rottela Panduga (రొట్టెల పండుగ). ఇది ప్రధానంగా Bara Shaheed Dargah వద్ద నిర్వహించబ...
View PostJune 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View Post