Sanatha Secrets

బలశాలి.. ధర్మశాలి.. సహస్రార్జునుడి అపూర్వ గాథ నుంచి మనమేం గ్రహించాలి అంటే..!


మానవ మాత్రుడై ఉండి కూడా వెయ్యి బాహువుల శక్తిని పొంది, సాక్షాత్తు లంకాధిపతి రావణుడినే బంధించిన వీరుడు కార్తవీర్యార్జునుడు. యయాతి వంశోద్భవుడైన కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అత్యంత పరాక్రమవంతుడైన ఈయన 'కార్తవీర్యార్జునుడు'గా, 'సహస్రార్జునుడు'గా చరిత్రలో నిలిచిపోయారు. కేవలం భుజబలమే కాకుండా, దైవబలం తోడైతేనే ధర్మాన్ని రక్షించగలమని నమ్మిన ఈ చక్రవర్తి జీవితం నేటికీ ఒక పాఠం.

కోరుకున్న నాలుగు వరాలు..?

రాజ్యం సిద్ధించినా మనశ్శాంతి కలగని అర్జునుడు, అత్రి మహర్షి పుత్రుడైన దత్తాత్రేయ స్వామిని శరణు వేడాడు. అరణ్యంలో కఠోర తపస్సు ఆచరించి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. భక్తుడి దీక్షకు మెచ్చిన దత్తాత్రేయుడు ప్రత్యక్షమవ్వగా, అర్జునుడు లోక కల్యాణం కోసం నాలుగు విశిష్ట వరాలను కోరుకున్నాడు:

సహస్ర బాహువులు.. అవసరమైనప్పుడు యుద్ధ రంగంలో వెయ్యి చేతులు ధరించే శక్తి.అధర్మ శిక్షణ.. లోకంలో అధర్మాన్ని అణచివేసే సామర్థ్యం. ధర్మ పరిపాలన..సకల భూమండలాన్ని జయించి, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే శక్తి.వీర మరణం..తనకంటే బలవంతుడైన యోధుడి చేతిలో మాత్రమే తనకు అంత్యం కలగాలి. దత్తాత్రేయుడి వరప్రసాదంతో కార్తవీర్యార్జునుడు అజేయుడిగా మారాడు. ఒకసారి నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతూ, తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్నే అడ్డుకున్నాడు. ఆ సమయంలో అక్కడే శివపూజ చేస్తున్న రావణుడు ఆగ్రహించి యుద్ధానికి దిగాడు. అయితే, కార్తవీర్యార్జునుడు అనతికాలంలోనే రావణుడిని బంధించి తన రాజధాని మహిష్మతికి తీసుకువెళ్లాడు. చివరకు పులస్త్య బ్రహ్మ కోరిక మేరకు రావణుడిని విడిచిపెట్టి తన ఉదారతను చాటుకున్నాడు.

ముని శాపంతో.

అర్జునుడి పాలనలో రాజ్యం సుభిక్షంగా సాగింది. వేల సంఖ్యలో యజ్ఞాలు చేసి దేవతలను మెప్పించాడు. అయితే, విధివశాత్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతంలోని అడవిని దహనం చేయడంతో ఆయన శాపానికి గురయ్యాడు. 'ఒక బ్రాహ్మణుడి చేతిలో నీ బాహువులు ఖండించబడతాయి' అన్న వశిష్ఠుడి శాపమే అర్జునుడి నాలుగో వరానికి మార్గమైంది.

చివరకు భృగు వంశీయుడైన పరశురాముడితో తలపడ్డ అర్జునుడు, ఆయన గొడ్డలి దెబ్బకు తన వెయ్యి చేతులను కోల్పోయి వీరమరణం పొందాడు. తనకంటే శక్తిమంతుడైన విష్ణు అంశ సంభూతుడి చేతిలోనే మరణించాలన్న తన ఆఖరి కోరిక నెరవేరడంతో, కార్తవీర్యార్జునుడు ధన్యజీవిగా నిలిచాడు.

మనమేం గ్రహించాలి అంటే..? : అధికారం అహంకారాన్ని పెంచకూడదు, ధర్మాన్ని రక్షించే ఆయుధంగా మారాలి. కార్తవీర్యార్జునుడి జీవితం మనకు నేర్పే పరమార్థం ఇదే..!

Share This Article:

గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం

June 27, 2026

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...

View Post

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం ప్రారంభం – ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు పెద్దపీట

June 9, 2026

విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర...

View Post

తిరుమలలో 90 వేల మంది భక్తులు – రూ.4 కోట్ల హుండీ ఆదాయం - TTD Updates

June 8, 2026

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 90,000 మంది భక్తులు శ్ర...

View Post

Nellore Rottela Panduga 2026: జూన్ 26 నుంచి రొట్టెల పండుగ ప్రారంభం – ఏర్పాట్లు వేగవంతం

June 8, 2026

నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం Rottela Panduga (రొట్టెల పండుగ). ఇది ప్రధానంగా Bara Shaheed Dargah వద్ద నిర్వహించబ...

View Post

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 173116