సంపద, అదృష్టం పెరగాలంటే.. ఆదివారం రోజున మిరియాలతో ఈ ప్రత్యేక చర్యను చేయండి!
March 30, 2026
సంపద, అదృష్టం పెరగాలంటే.. ఆదివారం రోజున మిరియా...
View PostMarch 30, 2026
సంపద, అదృష్టం పెరగాలంటే.. ఆదివారం రోజున మిరియా...
View PostMarch 30, 2026
ఇంట్లో చీపురును ఏ మూలలో పెట్టితే ఐశ్వర్యం వస్...
View PostMarch 28, 2026
Tulsi plant (తులసి మొక్క) హిందూ సంప్రదాయంలో పవిత్రమైన...
View PostMarch 28, 2026
మనిషి జీవితంలో ఏర్పడే ప్రతి బంధం వెనుక ఒక గాఢమ...
View PostMarch 27, 2026
తులసి మొక్క (పవిత్ర హోలీ బాసిల్) భారతీయ హిందూ స...
View PostMarch 27, 2026
మనసులో ప్రశ్న కలిగించే విషయాల్లో ఒకటి: నల్ల పి...
View PostMarch 26, 2026
భారతీయ సంస్కృతిలో పూజలు, వేడుకలు, కొత్త ప్రారంభా...
View PostMarch 26, 2026
శ్రీరామనవమి అనేది భగవంతుడు శ్రీరాముడి జన్మది...
View PostMarch 25, 2026
మన చేతులలో ఉండే రేఖలు, గుర్తులు వ్యక్తిత్వం, భవి...
View PostMarch 25, 2026
సూర్య నమస్కారం భారతీయ యోగ సంప్రదాయంలో అత్యంత ...
View PostMarch 30, 2026
ఈ ఏడాది శ్రీ రామ నవమి పండుగ తాడిపత్రిలో కూడా హృదయపూర్వకంగా జరుపుకుంటున్నారు. శ్రీ రామ నవమి అనేది ప్రభువులు శ్రీరామచంద్రుని జన్మద...
View PostMarch 30, 2026
తెలంగాణ జాగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఆలయం వద్ద ఈ సమయంలో భక్తుల భారీ రద్దీ కనిపిస్తోంది. ఇక్కడి ఆ...
View PostMarch 30, 2026
తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) అన్నప్రసాదం కార్యక్రమం ఎంతో సక్రమంగా, విస్తృతంగా నిర్వహిస్తున్నంటూ తాజా సమాచారం అందుతోంది. తిరుమ...
View PostMarch 28, 2026
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవా కార్యక్రమాలకు మరోసారి భక్తుల ఉదారత చాటుకుంది. శ్రీ వేంకటేశ్వర ప్రాణాదాన ట్రస్టుకు ఒ...
View PostMarch 28, 2026
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులకు ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహించా...
View PostMarch 27, 2026
తెలంగాణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం భద్రాచలంలో నేడు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతున్న వేళ తెలంగాణ ...
View PostMarch 27, 2026
చిన్నచెల్మెడలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు – పూర్తి వివరాలుఈ ఏడాది శ్రీరామ నవమి పండుగ ఉత్సాహ భరితంగా, భక్తిపరంగా చిన్నచెల్మెడల...
View Post
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘మనోకారకుడు’ మనస్సుకు అధిపతి అని పిలుస్తారు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితిగతులు అన్నీ చంద్రుడి ప్రభావంతోనే ముడిపడి ఉంటాయి. ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా అశాంతితో బాధపడుతుంటారో.. వారు సోమవారం నాడు పరమశివునితో పాటు చంద్రుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

దైవ దర్శనం కోసం వెళ్ళినప్పుడు గుడి బయట వదిలిన పాదరక్షలు కనిపించకపోతే ఎవరికైనా బాధ కలగడం సహజం. కొందరు దీనిని అపశకునంగా భావిస్తారు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆలయం వద్ద చెప్పులు పోవడం వెనుక ఒక సానుకూల సందేశం దాగి ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగితే మీ కష్టాలు తీరబోతున్నాయని ప్రకృతి పంపిస్తున్న సంకేతం అంటున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం..
పాదరక్షలు - శని భగవానుడి ప్రభావం..
మనిషి శరీరంలోని పాదాలకు, అలాగే మనం ధరించే బూట్లు, చెప్పులకు శని దేవుడు కారకుడిగా ఉంటాడు. జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
దోష నివారణఆలయం వంటి పవిత్ర స్థలంలో పాదరక్షలు అపహరణకు గురవ్వడం అంటే, ఆ వ్యక్తిని అంటిపెట్టుకున్న శని దోషం లేదా ప్రతికూల శక్తి విడిచి వెళ్ళిందని అర్థం. ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగితే, త్వరలోనే మీ జీవితంలో ఉన్న దుఃఖాలు తొలగిపోయి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని సంకేతం.
దానం చేయలేని వారికి ప్రకృతి ఇచ్చిన అవకాశం..సాధారణంగా శని దోషం ఉన్నవారు లేదా ఏలిననాటి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు శనివారాల్లో పాదరక్షలను దానం చేయాలని శాస్త్రం చెబుతోంది.కొందరు తెలియకనో లేదా ఇతర కారణాల వల్లనో దానం చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆలయం బయట చెప్పులు పోవడాన్ని 'అప్రయత్న దానం'గా పరిగణించవచ్చు. మీ కష్టాలను ఆ చెప్పుల రూపంలో ఎవరో తీసుకెళ్లారని భావించి ప్రశాంతంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యక్తిత్వంపై పాదరక్షల ప్రభావం..మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడంలో పాదరక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్య రీత్యా కూడా చెప్పుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బూట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, పాలిష్ చేసి ఉండాలి. మురికిగా ఉన్న పాదరక్షలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఎట్టిపరిష్టితుల్లోనూ చిరిగిన లేదా పాడైపోయిన చెప్పులను ధరించడం మంచిది కాదు. ఇది చేసే పనుల్లో ఆటంకాలను సృష్టిస్తుంది. చాలామంది గుడిలో ఉన్నంత సేపు దేవుడి కంటే బయట ఉన్న తమ చెప్పులు లేదా బూట్లపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. కానీ, ప్రకృతి సిద్ధంగా జరిగే ఇటువంటి సంఘటనలు మీ మంచికే అని గ్రహించాలి. పాదరక్షల పోకడను ఒక నష్టంగా కాకుండా, శని దేవుడి అనుగ్రహంగా భావించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
భక్తి మార్గంలో వెళ్లేటప్పుడు ఇష్టమైన వస్తువులపై మోహం వదులుకోవాలనేది ఒక కోణమైతే, జ్యోతిష్య రీత్యా అది దోష నివారణకు మార్గమని మరో కోణం. కాబట్టి, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మీ చెప్పులు పోతే ఆందోళన చెందకండి.. మీ కష్టాలు తీరబోతున్నాయని నవ్వుతూ ముందుకు సాగాలని పండితులు చెబుతున్నారు.

అయోధ్యలో వెలసిన బాలరాముని దివ్యరూపం యావత్ ప్రపంచాన్ని మురిపిస్తుండగా.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ శ్రీరాముని భారీ విగ్రహం కొలువుదీరనుంది. ఢిల్లీలోని మంగోల్‌పూర్ కలాన్ గ్రామంలో సుమారు 100 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ఢిల్లీ గ్రామీణాభివృద్ధి బోర్డు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
భక్తిభావం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పార్కు..మంగోల్‌పూర్ కలాన్‌లోని రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హనుమాన్ మందిర్ పార్కును కేవలం విగ్రహ ప్రతిష్టకే పరిమితం చేయకుండా.. ఒక అద్భుతమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. సుమారు రూ. 55 కోట్ల వ్యయంతో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించనున్నారు. భక్తులు, పర్యాటకుల కోసం దీనిని ఒక పిక్నిక్ స్పాట్‌గా, సామాజిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
విగ్రహ విశేషాలు..?విగ్రహం మొత్తం ఎత్తు సుమారు 100 అడుగులు. ఇందులో 10 అడుగుల బేస్ (పీఠం) ఉండగా, దానిపై 81 అడుగుల ఎత్తులో శ్రీరాముని విగ్రహం విల్లు, బాణం ధరించి దర్శనమిస్తుంది. కమలం పువ్వుపై నిలబడి, భక్తులను ఆశీర్వదించే భంగిమలో రామయ్య విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. విగ్రహం పైన భారీ పందిరిని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఆర్.సి.సి (RCC) పునాదితో, ఉక్కు చట్రం, బాహ్య మెటల్ క్లాడింగ్‌తో అత్యంత పటిష్టంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తి కావడానికి సుమారు 18 నెలల సమయం పట్టనుంది.
రూ. 1,317 కోట్లతో గ్రామీణాభివృద్ధి..కేవలం విగ్రహం మాత్రమే కాకుండా, ఢిల్లీ గ్రామీణాభివృద్ధి బోర్డు మొత్తం 574 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 1,317 కోట్లను ఖర్చు చేయనున్నారు. పార్కు పునరాభివృద్ధిలో భాగంగా ల్యాండ్‌స్కేపింగ్, అత్యాధునిక లైటింగ్, సీటింగ్ ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు.
ఈ చారిత్రాత్మక నిర్ణయంపై బోర్డు చైర్మన్ రాజ్‌కుమార్ చౌహాన్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ ఢిల్లీకి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు వస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలను ఆధ్యాత్మికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రుద్రాక్షను ఆధ్యాత్మిక కవచంగా మహాదేవుడి రూపంగా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల ఆ మహాదేవుడి ఆశీర్వచానాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు భగవంతుని కరుణ ద్వారా జీవితంలోకి ఆనందం సిద్ధిస్తుంది. దీనిని ధరించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. రుద్రాక్ష ధరించేటప్పుడు అందుకు సంబంధించిన నియమాలను పాటించకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. రుద్రాక్ష ధరించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి..? అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. అవేంటంటే..?
రుద్రాక్ష ఎలాంటి వాళ్ళైనా ధరించవచ్చా..?శ్మశానవాటికకు వెళ్తున్నప్పుడు, అంత్యక్రియలకు వెళ్తున్నప్పుడు, ఇంటి నుంచి బయలుదేరే ముందు రుద్రాక్షను తీసివేసి ఆలయంలో ఉంచండి. ఎవరైనా బంధువులు చనిపోయిన సమయంలో, శోక సమయంలో రుద్రాక్ష ను అస్సలు ధరించకూడదు. అంతేకాదు ఇంట్లో పుట్టిన సమయంలో రుద్రాక్ష ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించకూడదు. కాబట్టి, నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసి ఇంట్లో పూజ గదిలో ఉంచాలి.
రుద్రాక్ష ధరించిన వారు మాంసం, మద్యం, వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. రుద్రాక్ష ధరించిన వ్యక్తి పొరపాటున కూడా మాంసం, మద్యం వంటివి తీసుకోకూడదు.
రుద్రాక్ష ధరించడానికి నియమాలు..రుద్రాక్ష ధరించే ముందు, దానిని పచ్చి పాలు, గంగా జలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత, మాత్రమే రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుద్రాక్షను ధరించే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి.
ఎర్రటి లేదా పసుపు పట్టు దారంతో కట్టిన రుద్రాక్షను ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఒకరు ధరించిన లేదా తీసివేసిన రుద్రాక్షను మరొకరు ధరించకూడదు.
రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..?రుద్రాక్ష ధరించిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అంతేకాదు ఆ మహేశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
ప్రతికూల శక్తులు దగ్గరకు చేరవు. అదృష్టం వరిస్తుంది.
రుద్రాక్ష ధరించాలనుకుంటే, సోమవారం మహాశివుడికి ప్రియమైన రోజు కాబట్టి సోమవారాన్నే శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా సోమవారం లేదా మహాశివరాత్రి నాడు రుద్రాక్ష ధరించడం శుభప్రదమైనదిగా భావిస్తారు.

మానవ జీవితంలో కలలు అనేవి కేవలం నిద్రావస్థలో వచ్చే ఊహా చిత్రాలు మాత్రమే కావని, అవి రాబోయే భవిష్యత్తుకు సంకేతాలని 'స్వప్న శాస్త్రం' చెబుతోంది. కొన్ని కలలు మనకు కలిగే ఆర్థిక లాభాలను, మరికొన్ని మనం అందుకోబోయే శుభవార్తలను ముందుగానే సూచిస్తాయి. శాస్త్రం ప్రకారం ఏయే కలలు శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
శుభకార్యాల సూచన..మీ కలలో ఎవరైనా తెలిసిన స్త్రీ పెళ్లి దుస్తుల్లో కనిపించినా లేదా ఒకరి వివాహ ఊరేగింపు (బారాత్) కనిపిస్తే అది ఎంతో శుభప్రదం. ఇలాంటి కలలు మీ జీవితంలోకి త్వరలోనే ఆనందం ప్రవేశించబోతోందని చెప్పడానికి నిదర్శనం. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయని, శుభవార్తలు వింటారని దీని అర్థం.
పాము కనిపిస్తే భయం వద్దు..సాధారణంగా కలలో పాము కనిపిస్తే చాలామంది భయపడతారు. కానీ, స్వప్న శాస్త్రం ప్రకారం పాములకు సంబంధించిన కొన్ని కలలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కలలో రంగురంగుల పాములు కనిపిస్తే మీ జీవితంలో సంతోషకరమైన మార్పులు రాబోతున్నాయని అర్థం. ఒకవేళ మీరు పామును పట్టుకున్నట్లు కల వస్తే, అది ఆర్థిక పురోగతికి సంకేతం. మీ కష్టాలు తొలగిపోయి, ధన లాభం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది.
దైవ దర్శనం, ప్రకృతి సంకేతాలుహిందూ ధర్మంలో సూర్య భగవానుడికి విశిష్ట స్థానం ఉంది. భవిష్య పురాణం ప్రకారం, కలలో భాస్కరుడు కనిపిస్తే మీరు త్వరలోనే ఒక పెద్ద విజయాన్ని లేదా ప్రయోజనాన్ని పొందుతారని అర్థం. వీటితో పాటు మరికొన్ని శుభ సంకేతాలు:
కలలో వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అది సుఖశాంతులకు చిహ్నం. బంగారం దొరికినట్లు కల రావడం లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది. ఆలయాన్ని సందర్శించినట్లు లేదా ఎత్తైన ప్రదేశంలో కొండలు, శిఖరాలుఉన్నట్లు కల వస్తే మీ ఆశయాలు నెరవేరుతాయని అర్థం.
స్వప్న శాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కలలు అనేవి మన ఆలోచనల ప్రతిరూపాలు కూడా కావచ్చు. కాబట్టి సానుకూల దృక్పథంతో వీటిని అర్థం చేసుకోవడం ఉత్తమం.