Sanatha Secrets

పాత్రలోంచి నేరుగా తింటే..లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందా..?


సనాతన ధర్మంలో ఆహారాన్ని కేవలం ఆకలిని తీర్చే ఇంధనంగా కాకుండా, 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని పూజిస్తాం. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సమయం లేకనో, బద్ధకంతోనో వండిన పాత్రలు అంటే గిన్నెలు,బాణలిలలోనే నేరుగా ఆహారాన్ని తినేస్తుంటారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం... ఇలా చేయడం చాలా పెద్ద తప్పిదమని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత్రలోంచి నేరుగా తినడం వల్ల లక్ష్మీదేవి, అన్నపూర్ణా దేవి శాశ్వతంగా కోపగించుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆచరణాత్మక కారణాలు,వంటగదికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు మీకోసం...

శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

మన సనాతన గ్రంథాల ప్రకారం, వంట పాత్ర నుండి నేరుగా భోజనం చేయడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట నిలవకుండా వెళ్ళిపోతుందని, దరిద్రం తాండవిస్తుందని నమ్ముతారు. వంట చేసే పాత్రను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే పాత్రలో నేరుగా నోరు పెట్టి లేదా ఎంగిలి చేత్తో తినడం వల్ల ఆ పాత్ర అపవిత్రమవుతుంది. ఇది అన్నపూర్ణా దేవిని అవమానించడమే. పాత్రల్లోంచి నేరుగా తినే అలవాటు ఉన్నవారికి పెళ్లి సమయంలో భారీగా వర్షం పడుతుందని ఒక నానుడి ఉంది. ఇదొక సామాజిక నమ్మకం అయినప్పటికీ, ఈ అలవాటును మాన్పించడానికి పెద్దలు చెప్పిన లోతైన హెచ్చరికగా దీనిని భావించవచ్చు.

ఆరోగ్య, భద్రతా కోణం..

శాస్త్ర నియమాలతో పాటు దీని వెనుక బలమైన ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. వంట చేసిన పాత్రలు చాలా సమయం వరకు వేడిగా ఉంటాయి. తొందరపాటులో వాటి నుంచి నేరుగా తింటే చేతులు, నోరు కాలే ప్రమాదం ఉంది. పాత్రలో మిగిలి ఉన్న ఆహారంలో నేరుగా చెయ్యి పెట్టడం వల్ల, లాలాజలం లేదా ఎంగిలి తగిలి మొత్తం ఆహారం త్వరగా పాడైపోతుంది. అందువల్ల, ఆహారాన్ని ఎల్లప్పుడూ వేరొక పళ్ళెంలోకి మార్చుకుని తినడమే ఆరోగ్యకరం, శ్రేయస్కరం.

వంటగది వాస్తు నియమాలు తప్పక పాటించండి..

ఇంటి ఇల్లాలు లేదా వంట చేసేవారు వంటగదిలో కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వంట చేసేటప్పుడు ఎల్లప్పుడూ మీ ముఖం తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది కుటుంబ సభ్యులకు ఉత్తమ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను చేకూరుస్తుంది.

దక్షిణం వైపు తిరిగి వంట చేయడం వల్ల ఇంట్లో మానసిక ఒత్తిడి, కలహాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా మారిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించి ఆహారాన్ని వండాలి లేదా స్వీకరించాలి. దీనివల్ల అన్నపూర్ణా దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

భారతీయ సంప్రదాయంలో ఆవును సర్వదేవతా స్వరూపంగా భావిస్తాం. అందుకే ఉదయం వండే మొదటి ఆహారంలో కొంత భాగాన్ని గోమాతకు సమర్పించాలి. ఈ నియమాన్ని ప్రతిరోజూ పాటించడం వల్ల పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా, ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలన్నా, ఇంట్లో సకల శుభాలు కలగాలన్నా భోజన నియమాలను, వాస్తు సూత్రాలను గౌరవించడం ఎంతో ముఖ్యం. కాబట్టి నేటి నుంచే గిన్నెల్లోంచి నేరుగా తినే అలవాటుకు స్వస్తి చెప్పండి..!

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127157