Mana Alayam

History Of Temples

Bhadhrachalam

Sree Seetha Ramachandraswamy Vari Devasthanam

Srisailam

Mallikarjuna Swamy Devasthanam


Mahanandi

Sri Mahanandeeswara Swamy Devasthanam

Annavaram

Sri Veera Venkata Sathyanarayana Swamy

Kanipakam

Sri Swayambhu Varasidhi Vinayaka Swamy

Vijayawada

Kanaka Durga Temple



Srikalahasti

Sri Srikalahasti Temple

Tirupathi

Sri Venkateswara Swamy

Simhachalam

Sri Varaha Lakshmi Narasimha Swami

Komravelli

Komuravelli Mallanna Swamy

Kasapuram

Sri Nettikanti Anjaneya Swamy

Penuganchiprolu

Sri Tirupathamma Ammavari

What's the REAL Story of Gudimallam Temple's SHIVALINGAM? | Mana Alayam | EP-28

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఉన్న ఈ ఆలయం మన పురాతన ఇతిహాసానికి శిల్ప కలకు ఆధ్యాత్మికతకు ప్రత్యేకగా నిలుస్తుంది. ఇది తిరుపతి నగరానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఇది మహాశివుని స్థలంగా పేరు పొందింది. భారతదేశపు ప్రాచీన శివాలయంగా చరిత్రలో స్థానం సంపాదించింది. గుడిమల్లం ఆలయం శాతవాహనుల కాలానికి చెందిందిగా గుర్తించబడింది. దీనిలోని లింగం ఒకటవ లేదా రెండవ శతాబ్దానికి చెందిందిగా భావించబడిన భారత పురావస్తు సర్వేక్షణ విస్తృత పరిశోధనల తర్వాత ఈ లింగం క్రీస్త పూర్వం రెండవ శతాబ్దానికి చెందిందని నిర్ధారించబడింది. 1973 లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించారు. ఇక్కడ శివలింగం కంటే ఆలయం మునుపటి కాలానికి చెందిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంటే ప్రస్తుత భవనం చోలులు మరియు విజయనగర సామ్రాజ్య కాలానికి మరింత తరువాత కాలానికి చెందింది. లింగం మొదట బహిరంగంగా ఉండి ఉండవచ్చంటూ అభిప్రాయం. 1954 నుంచి ఈ ఆలయం భారత పురావస్తు సర్వేక్షణ ఏఎస్ఐ చే పరిరక్షించబడుతోంది. పురాతన శిల్పకలకు ప్రతిరూపంగా నిలిచే ఈ శివలింగాన్ని టిఏ గోపీనాథరావు ఇలా వర్ణించారు. ఇది మొదలు గోధుమ రంగు గల గట్టి రాతితో తయారైింది. సుమారు ఐద అడుగుల ఎత్తుతో విస్తారంగా ఉన్న ఈ లింగం భూమిలో కొంత భాగం పూర్చబడి ఉంది. లింగ ముందు భాగంలో మరుగుజ్జు ఆకారంలోని అపస్వారుని బొమ్మను మనం చూస్తాం. శివుడు ఒక వేటగాడి రూపంలో కనిపిస్తాడు. కుడి చేతిలో జింక ఎడమ చేతిలో నీటికుండ ఎడమ భుజంపై గొడ్డలి ఉంటుంది. ధోతి మెఘల చెవి పోగులు ఐదు కంకణాలు చేతి ఉంగరాలు అన్ని చాలా సూక్ష్మంగా చెక్కబడి ఉంటాయి. ఆయనకు యజ్ఞోపవీతము లేదు కానీ తలపై పొడవైన జుట్టుంది. ఇంకా ఈ ఆలయం గర్భగుడి చతురస్రాకార ప్రణాళికలో నిర్మించబడి పైభాగం అగ్రభాగపు నిర్మాణంగా ఉంటుంది. హిమాన్షురి అనే చరిత్రకారుడి ప్రకారం ఇది పాడైపోయే పదార్థాలతో తయారైన పురాతన ఆలయ నిర్మాణాన్ని సూచిస్తుంది. మునుపటి నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని పునః నిర్మాణం చేయబడిందని చెప్తారు. ఆలయ గోడలపై ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ యాదవ దేవరాయులు గంగా పల్లవ బాన చోలకాలానికి చెందిన అనేక శాసనాలు లభించాయి. అత్యంత పురాతన శాసనం నందివర్మ పల్లవ పాలనకు చెందినది. ఈ శాసనాలు దాతలు ఆలయానికి ఇచ్చిన బహుమతులను మాత్రమే ప్రస్తావించాయి. మరి మీరు కూడా తిరుపతి యాత్రకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి. ఇదివరకే మీరు ఈ ఆలయాన్ని దర్శించిఉంటే మీ అనుభవాలను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన విల్లాస్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

Read more
ఇసుకతో శివలింగం చేసిన దేవత ఎవరు? ఆశ్చర్యకరమైన పురాణ రహస్యం!

ఆ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేసిన దేవత ఎవరో మీకు తెలుసా? ఆమె కోసం శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఇచ్చిన వరం గురించి తెలుసా? ఈ వీడియోలో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ఆమె తపస్సుకి మెచ్చి శివుడు ఆమెక ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు రహస్యాలు రాస్కు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మన బెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

కామాక్షి అమ్మవారి దేవాలయం ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాలలో ఒకటి. ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది. ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉండొచ్చు అని భక్తుల నమ్మకం. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరిగా ఈ ఆలయంలో స్థిరపడింది. ఈ పురాతన ఆలయం పెరునారాత్రుడు పడై అని ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది.

ఇది సంఘం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంఘం యుగం రాజు తొండైమాన్ ఇలంతిరయ్యన్నను ప్రశంసించింది. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం అరూప లక్ష్మి, స్వరూప లక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీ చక్ర యంత్రం ఉంది. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవత ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాల్లో ఒకటి. ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షి దేవి ఆలయంలో శ్రీ చక్రాన్ని ఆ మందిరంలోని తొట్టి లాంటి నిర్మాణంలో స్థాపించారు. శివుణని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధన సేవలు అందిస్తారు.

వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంత కాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం తెప్పోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాశలో నవరాత్రి, ఆడి, ఐపాసి మాసంలో శంకర జయంతి వసంత ఉత్సవాలు జరుగుతాయి. మీరు కూడా కంచిలోని కామాక్షి అమ్మవారిని దర్శించుంటే మీ అనుభవాలను కామెంట్స్ లో షేర్ చేయండి.

Read more
The Secret of the Govinda Raja Swamy Temple! | అభిషేకం ఎందుకు చేయరో తెలుసా!

శ్రీ వెంకటేశ్వరునికి అన్నయ్యగా భావించే ఈ గోవిందరాజు స్వామి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని తమ్ముడు పెళ్లికి ఉపయోగించడానికి కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు తన కుటుంబంతో కలిసి శ్రీనివాసుని దర్శించేందుకు తిరుమలకి వచ్చారు. రాజు రాణి భక్తితో స్వామిని సేవించి సంతాన భిక్ష కోరారు. ఓ రాత్రి రాణి కలలో స్వామి వారు ప్రత్యక్షమై నీ ముక్కుకు ఉన్న నా సామానిని నాకుఇవ్వు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని అన్నారట. దానికి ఆ రాణి నేను భర్త ఆజ్ఞకి లోబడిన దానిని స్వామి ఆయన అనుమతిస్తేనే ఇవ్వగలను అన్నది. అందుకు స్వామి వారు నవ్వుతూ అయితే నేను ఏకాధిపతి కాదమ్మ నా అన్న గోవిందరాజుడు అనుమతిస్తేనే నీకు సంతానం ప్రసాదించగలను అన్నారట. అప్పటినుంచి భక్తులు గోవిందరాజ స్వామిని తిరుమల శ్రీనివాసుడి అన్నగా భావిస్తూ పరమ భక్తితో ఆరాధిస్తున్నారు. క్రిమికంటుడు అనే సైబుడు శ్రీరామానుజుల కాలంలో చిదంబరంలోని శేషసైనుడైన గోవిందరాజ స్వామి ఆలయంపై దాడి చేసి అక్కడ విగ్రహాన్ని సముద్రంలో తోయించాడు. అప్పుడు ఆలయ వైష్ణవ పూజారులు ప్రాణభయంతో రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ అల్లకల్లోల సమయంలో కొందరు పూజారులు స్వామి వారి ఉత్సవ మూర్తులతో తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. ఈ వార్త విని ఆచార్యులు చింతించారు. చిదంబరంలో నశించిన దేవాలయాన్ని తిరిగి నిర్మించాలనే సంకల్పంతో విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేసి తిరుపతిలో ప్రతిష్టించారు. అంతేకాదు చిదంబరం నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలతో నిత్య పూజలు కొనసాగేలా దృఢమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడి స్వామి విగ్రహం శిలతో కాక శుద్ధ మట్టితో చేయబడిన అపూర్వ మూర్తి అందుకే ఇక్కడ విగ్రహానికి అభిషేకం జరగదు. ఇదే ఈ ఆలయ విశిష్టత. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం లాగే ఇక్కడ కూడా శుద్ధ వైకానస ఆగమాన్ని నిబద్ధంగా పాటిస్తారు. ఈ ఆలయంలో రెండు గోపురాలు ఉన్నాయి. బాహ్య ప్రాంగణంలోని గాలి గోపురం ఎంత వైభవంగా ఉంటుందో పురాతనమైన లోపలి గోపురం శిల్ప కలతో అంతే అందంగా ఉంటుంది. రామాయణం భాగవతం గాదల్ని చెక్కిన శిల్పాలు మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తాయి. ఇక్కడ గోవిందరాజస్వామి శేషసైనునిగా ఉత్తర దిక్కుకు పాదాలు దక్షిణ దిశలో తలపెట్టుకొని శంఖ చక్రాదులతో నాభి కమలంలో బ్రహ్మతో కిరీటాలతో భక్తులకు దర్శనం ఇస్తాడు. అతని చుట్టూ అలంకృతమై ఉన్న ఆండాల్ అమ్మవారు శ్రీకృష్ణుడు శ్రీరామానుజులు తిరుమంగై అల్వారు శ్రీ వేదాంత దేశికులు శ్రీ లక్ష్మీదేవి సన్నిధులు ఉన్నాయి. శాసనాల ప్రకారం 1235లో మూడవ రాజరాజ చోలుడి పాలనలో ఉంది అని చెప్తారు. ఇక 1239 లో నరసింహ యాదవరాయుల కాలంలో కొన్ని మరమత్తలకు దాతృత్వం ఇచ్చారు. 1506 లో విజయనగర రాజుల పాలల్లో ఆలయ అభివృద్ధి జరిగింది. ఇక తిరుమల శ్రీనివాసుడు తిరుపతి గోవిందరాజులు రెండు విష్ణు స్వరూపాలే అయినా భక్తులు గోవిందరాజ స్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చేవారు ముందుగా గోవిందరాజ స్వామిని దర్శించి కొండపైకి వెళ్ళేవారు. కొండెక్కలేని వారు గోవిందరాజ స్వామిని దర్శించుకొని వెళ్ళేవారు. మరి మీరు కూడా తిరుపతి యాత్రకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి.

Read more
కీసరగుట్ట ఆలయ చరిత్ర | 101 శివలింగాల రహస్యం |

ఆ ఆ ఓం రామలింగ ప్రభం వందే జగత్కారణ కారణం త్రిపురా హంతారం భక్తకల్పమయహం నా పేరు రవికాంత్ శర్మ ఈ కీసరగుట్ట దేవాలయంలో ముఖ్యార్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ కీసరగుట్ట యొక్క చరిత్ర ఏంటంటే పూర్వము త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వనవిహారానికే వచ్చాడు సీతాదేవి లక్ష్మణుడితో సహా హనుమంతుడితో సహా ఇక్కడికి వచ్చాడుఅన్నమాట రావణాసురుడి సంహారం తర్వాత ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యానికి ఎంతో మంత్రముగ్ధుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఒక శివలింగ ప్రతిష్టాపన చేద్దాం అనుకున్నాడు. ఆ శివలింగ ప్రతిష్టాపనకు కావలసినటువంటి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుని కాశీకి పంపించాడు. అయితే హనుమంతుడు కాశీకి వెళ్ళాక అక్కడ ఎన్నో శివలింగాలు కనిపించాయి అయితే ఏదైనా ఒక శివలింగం తీసుకొస్తే ఆ రాముడు ఇష్టపడతాడో లేదో అని చెప్పి హనుమంతుడు కాశీలో చాలా ఆలస్యం చేశాడు. రాముడికి అంతలోపట ముహూర్త సమయం దగ్గరికి వచ్చింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమ ఆలోచించి శివుని ప్రార్థించాడు స్వామి మరి నాకు ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది హనుమంతుడేమో శివలింగం తీసుకురాలేదు ఇంతవరకు అని చెప్పి ఆ శివుని ప్రార్థిస్తే ఆ శివుడే రాముడి కోసం స్వయంగా వెలిసాడు అన్నమాట ఇక్కడ అయితే రామచంద్రుడు ఆ మూర్తి సమయానికి ఆ శివలింగ ప్రతిష్టాపన పూర్తి చేశాడు. హనుమంతుడు కాశీలో ఏం ఆలోచించాడు అంటే కాశీ నుండి 101 శివలింగాలు తీసుకొస్తే నా స్వామికి ఇష్టమైన శివలింగం ఒకటి తీసుకుంటాడు అని చెప్పి కాశీ నుండి 101 శివలింగాలు తీసుకొచ్చాడు. అది ఇక్కడ ప్రతిష్ట అయిపోయిందని చెప్పేసరికి ఆయనక ఎంతో బాధ అనిపించింది హనుమంతుడికి నేను ఎంతో కష్టపడి కాశీ నుండి తీసుకొచ్చాను శివలింగాలు నా స్వామికి ఒక్క శివలింగం కూడా ఉపయోగపడలేదుఅని చెప్పి బాధపడుతుంటే శ్రీరామచంద్రుడు మళ్ళీ ఆయన బాధ కోపం పోవడానికి ఆయన తెచ్చినటువంటి 101 శివలింగాల్లో నుంచి మళ్ళీ ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అన్నమాట అది పక్కకే ఉంటుంది. ఆ స్వామి పేరు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి మారుతి అంటే హనుమంతుడు కాశీ నుండి తీసుకొచ్చింది కాబట్టి మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి స్వామి వారి పేరు రామలింగేశ్వర స్వామి రాముడు ప్రతిష్టించాడు గనుక రామలింగేశ్వర స్వామి తర్వాత ఈ గుడి పేరు కూడా కేసరిగిరి అంటే హనుమంతుడు కేసరినందరుడు హనుమంతుడి కోపం బాధ పోవడానికి హనుమంతుని క్షేత్రపాలకుని చేసి ఆ ఈ గుడి పేరు కూడా కేసరిగిరిగా పెట్టడం జరిగింది అది రానురాను కీసరి గుట్టగా మారిందన్నమాట అయితే తర్వాత ఈ క్షేత్రాన్ని 1600 సంవత్సరాల క్రితం ఇక్కడ విష్ణుకుండి రాజులు అనే రాజులు ఉండేవారు వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకున్నారు అన్నమాట అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకప్పుడు ఇక్కడ ఒక నిర్మాణం చేద్దామని చెప్పి త్రవకాలు జరిపితే అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఆనవాళ్ళు బయటిక వచ్చాయి. అప్పుడు పురావస్త శాఖ వారు జరిపినటువంటి ఆ రీసెర్చ్ లో ఏం తేలిందంటే ఇక్కడ విష్ణుకుండి రాజులు పరిపాలించారు రెండవ మాధవర్మ అనే రాజు ఇక్కడ పరిపాలించి ఈ వారి యొక్క రాజధానిగా పెట్టుకొని పరిపాలించినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు బయటికి వచ్చాయి అవన్నీ కూడా కిందే ఉంటాయి. తర్వాత వారే ఈ దేవాలయాన్ని లోపట ఉన్నటువంటి రాళ్లతో కట్టినటువంటి దేవాలయం నిర్మించినట్టుగా వారే తెలియజేయడం జరిగింది తర్వాత పక్కనే ఈ యొక్క శివాలయాన్ని వైష్ణవ దేవాలయం కూడా మారుద్దామని చెప్పి అక్కన్న మాదన్నలు నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కన మాదన్నలు పక్కకే నరసింహ స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ విధంగా హరిహర క్షేత్రంగా అప్పటినుంచి విరాజిల్లుతూ వస్తుంది. శివరాత్రికి అయితే ఇక్కడ పక్కనే సిటీలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ అమ్మగూడ ప్రాంతం నుండి ఎంతో మంది ఇక్కడికి ఎడ్లబండ్లలో వచ్చి ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు బస చేసి ఈ శివరాత్రి జాతరలో పాల్గొనేవారన్నమాట అప్పుడు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో తర్వాత శ్రావణ మాసంలో విశేష పూజలు జరుగుతాయి నెల రోజుల పాటు ఆ శ్రావణ మాసంలో ఉత్తర భారతీయులు ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇప్పుడు మన తెలుగు వారికి ఎంతో పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో భక్తులంతా కూడా లక్షల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు ప్రాముఖ్యమైనటువంటి ఈ నెల సూర్యుడు ఆ తులా రాశిలో అంటే నీచ రాశిలో ఉంటాడు ఇప్పుడు కాబట్టి మనము మొక్కడం వల్ల దోషం తొలగిపోతుంది అని చెప్పి ఈ నెలంతా కూడా శివుణని ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి నెలంతా కూడా అలాగే కీసరగుట్టలో 101 శివలింగాలు ఉన్నాయి కొండపైన అంటే ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ కొండపైన అడుగు పెడితేనే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి మనం అనుకునేవన్నీ కూడా జరుగుతాయి అని ప్రతిది కాబట్టి ఇక్కడ భక్తులు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి 11 రోజుల పాటు ప్రతిరోజు స్వామిని దర్శించుకొని 11వ రోజు స్వామికి అభిషేకం చేసుకొని నిద్ర చేయడం జరుగుతుంది. అలా చేస్తే వారు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి ప్రతీతి అన్నమాట. ఎందుకంటే కొండంతా కూడా 101 లింగాలు ఉన్నాయి కదా ఎక్కడ కూడా ఒక కొండ పైన ఇన్ని శివలింగాలు లేవు ఇంత పవిత్రమైనటువంటి కొండ ఎక్కడ కూడా లేదు. అంత పవిత్రమైనటువంటి కొండ ఇక్కడ కాబట్టి భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ ఆ విధంగా దీక్ష 11 రోజుల పాటు దీక్ష చేసి నిద్ర చేస్తారు ఆ విధంగా వారు అనుకున్నవన్నీ కూడా తీరుతుంటాయి. అలా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆ విధంగా ఈ కార్తీక మాసంలో కూడా లక్షల సంఖ్యలో స్వామి దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే మనం మూలవిరాట్కి స్వామికి అభిషేకం చేసుకోనే అవకాశం లేకపోయినా ఈ 101 శివలింగాలు ఉన్నాయి బయట కాబట్టి ఏదైనా ఒక శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకున్న స్వామికి కడిమి జలంతో అభిషేకం చేసుకున్న ఒక బిల్వపత్ర పెట్టి కాస్త విభూది స్వామికి అలంకరించినా కూడా వారు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి కాబట్టి కొండంతా కూడా శివలింగాలే కాబట్టి భక్తులంతా కూడా చక్కగా వచ్చి స్వామికి అభిషేకం చేసుకుంటుంటారు. కాబట్టి భక్తులంతా కూడా చక్కగా వచ్చి స్వామిని దర్శించుకుంటూంటారు. ఈ విధంగా స్వామిని దర్శించుకొని ధరించుకొని వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు.

Read more
శివుడు విషం తాగిన తర్వాత విశ్రాంతి తీసుకున్న అద్భుత స్థలం – సురుటుపల్లి రహస్యాలు

తిరుపతి జిల్లాలోని సురుటిపల్లె గ్రామంలో వెలిసిన ఈ పురాతన శైవక్షేత్రం అసాధారణమైనది. ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో కాక సజీవ రూపంలో అది కూడా పార్వతీ దేవి ఒడిలో సైనించిన అద్భుత భంగిమలో దర్శనం ఇస్తాడు. ఈ దృశ్యం చూస్తే మనసు పరవసిస్తుంది. ఆత్మ పులకరిస్తుంది. దేవదానవులు క్షీరసాగర మదనంలో అమృతం కోసం పడిన కష్టం మనందరికీ తెలుసు కానీ అమృతానికి ముందువచ్చిన హలాహలం అనే కాలకూట విషం మూడు లోకాలను భయపెట్టింది. అప్పుడు సురాసురులు శివుడిని శరణు వేడగా ఆయన ఆ విషాన్ని మింగి తన గరళలంలో దాచుకున్నాడు. కానీ ఆ విషం ప్రభావంతో తూలిన శివుడు పార్వతీ దేవి ఒడిలో కొంతసేపు విశ్రమించాడు. ఆ పవిత్ర ప్రదేశమే సురుటుపల్లె క్షేత్రం ఇంకో విశేషం ఏంటంటే విషం కడుపులోకి వెళ్ళకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ రూపంలో శివుడి గొంతులోనే నిలిచాడు. దీంతో శివుడి గొంతు నీలి రంగులోకి మారి ఆయన నీల కంఠుడిగా విష్ణువు నీలి మేఘశ్యాముడిగా ప్రసిద్ధి చెందారు. ఈ అద్భుత సంఘటనను నారదుడు మూడు లోకాలకు చాటాడు. సురగణాలు సప్తఋషులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు సురపల్లకి తరలి వచ్చారు. నందీశ్వరుడు వారిని నిలువరించగా మేలుకున్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చాడు. ఆనందోత్సాహంతో దేవతలు నృత్యాలు చేశారు. ఈ కారణంగా ఈ ప్రాంతం సురులపల్లిగా పిలవబడి కాలక్రమంలో సురుటపల్లిగా మారింది. ఈ ఆలయం సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా విరాజిలుతోంది. శనిపీడితలు నక్షత్ర దోషాలు పితృ దోషాలతో బాధపడేవారు కృష్ణ పక్ష శనివారం త్రయోదశి తిధిలో సంధ్యా సమయంలో జరిగే ప్రదోష పూజలో పాల్గొని దోష నివృత్తి చేసుకుంటారు. సైన భంగిమలో శివుణని దర్శించడం వల్ల మనసుకు అనిర్వచనీయ శాంతి ఆనందం కలుగుతాయి. ఈ అద్భుత ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర పుక్కరాయులు క్రీస్తు శకం 1344 47 మధ్య నిర్మించారు. 1833 లో శ్రీకాళహస్తి సంస్థానాదీసులైన రాజావారు జీర్ణోద్ధరణ జరిపినట్లు ఆలయ కూజ్యాలపై లికింపబడి ఉంది. 1979లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆలయ మహా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చే నిర్వహించబడుతుంది. సురిటిపల్లి ఆలయం తిరుపతి నుంచి 73 కిలోమీటర్లు చెన్నై నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయంలో ఐదు కాటేజీ రూములు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

Read more
తిరుమల తిరుపతి అసలు చరిత్ర

ప్రపంచ ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం మన తెలుగు రాష్ట్రంలో ఉన్న తిరుపతి దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 50వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తూ ఉంటారు. పండుగలు మరియు సెలవులు ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇందువల్లే తిరుమల ఆలయం ప్రపంచంలోనే ప్రత్యేక హిందూ ఆలయాల్లో ఎక్కువమంది భక్తులు దర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ రికార్డులో కూడా స్థానం పొందింది. ఇంతలా ప్రాముఖ్యత దక్కించుకున్న ఈ దేవాలయం చరిత్ర ఏంటి? వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఎలా అవతరించారు? ఈ ఆలయం ప్రత్యేకతలు రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. [సంగీతం] [సంగీతం] కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి యజ్ఞం చేయమని ఋషులకు నారదుడు సలహా ఇచ్చాడు. ఋషులంతా ఏకమై సప్తఋషుల్లో ఒకరైన బృగు మహర్షికి ఈ బాధ్యతను అప్పగించారు. బృగు మహర్షి మొదట బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో మునిగిపోయి మహర్షిని గుర్తించలేదు. తర్వాత శివుని వద్దకు వెళ్ళగా శివుడు తన ధ్యానంలో లీనమై ఉన్నాడు. చివరగా బృగు మహర్షి వైకుంఠంలో విష్ణువును సందర్శించాడు. అప్పుడు విష్ణువు ఆదిశేషునపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉన్నాడు. విష్ణువు పాదాలు మహర్షి వైపు ఉన్నాయి. దీని అవమానంగా భావించిన భ్రువ మహర్షి కోపంతో విష్ణువు చాతిపై కాలితో తన్నాడు. విష్ణువు మేల్కొని మహర్షి పాదాలకు నమస్కరించాడు. ఈ సంఘటన విష్ణువు చాతిలో నివసించే లక్ష్మీదేవికి అవమానంగా అనిపించింది. అంతే ఆమె కోపంతో వైకుంఠాన్ని వదిలి భూమిపై కొలహాపూర్కి చేరుకుంది. అక్కడ కొలహాసుర అనే రాక్షసుని ఓడించి అమ్మబాయిగా పూజలు అందుకుంటుంది. ఇక విష్ణువు లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఒంటరిగా ఉండలేక శ్రీనివాసుడిగా మానవ రూపం ధరించి భూమిపైకి వచ్చాడు. లక్ష్మీదేవిని వెతుకుతూ చివరగా తిరుమల కొండపై చేరుకొని గాఢ ధ్యానంలో మునిగాడు. అతని చుట్టూ ఒక పెద్ద పుట్ట కూడా ఏర్పడింది. ఈ విషయం తెలిసిన లక్ష్మీదేవి శివుడు మరియు బ్రహ్మలను సహాయం కోరింది. శివుడేమో ఆవుగా బ్రహ్మ దూడగా మారి స్థానిక చోలరాజు పశువుల మందలో చేరారు. ప్రతిరోజు ఆ ఆవు పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలు అందించేది. కానీ ఒకరోజు ఈ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆవుని కొట్టడానికి కర్ర తీసుకున్నాడు. అప్పుడు శ్రీనివాసుడు పుట్టలో నుంచి బయటకవచ్చి ఆవుని కాపాడాడు. కానీ ఆ కర్ర శ్రీనివాసుడి తలకు తగిలింది. ఆ దెబ్బే నేటికి స్వామి తలపై నామంగా కనిపిస్తుంది. కోపంతో శ్రీనివాసుడు కాపరిని సపించగా అతను అక్కడే మరణించాడు. ఈ వార్త చోవలరాజుకు తెలిసి అతను స్వయంగా వచ్చి ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ బ్రహ్మ శివులను గుర్తించగా ఆవు మరియు దూడను చంపడానికి బాణం సంధించాడు. శ్రీనివాసుడు ఆ బాణాన్ని అడ్డుకొని నీవు రాక్షసుడిగా జన్మిస్తావు అని రాజుని శపించాడు. రాజు క్షమాపణ కొరగా శ్రీనివాసుడు వచ్చే జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటాను అని వరమిచ్చాడు. చోలరాజు ఆకాశరాజుగా పునర్జన్మించి యజ్ఞం చేయగా బంగారు కమలంలో పద్మావతి అనే కూతురు జన్మించింది. పద్మావతి అన్ని విద్యలు నేర్చుకొని యువరాణిగా ఎదిగింది. ఒకరోజు శ్రీనివాసుడు ఆశ్రమంలో ఉండగా అతని తలపై దెబ్బ వల్ల ఏర్పడిన మచ్చను చూసిన ఒక యువతి తన జుట్టును సమర్పించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఇక నుంచి నా భక్తులు తమ వెంట్రుకలను నీకు సమర్పిస్తారు అని వరమిచ్చాడు. అందుకే తిరుమలలో తలనీలాలు సమర్పించే సంప్రదాయం కనిపిస్తుంది. ఒకసారి శ్రీనివాసుడు అడవిలో వేటకు వెళ్ళగా పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. ఆకాశరాజు వారి ప్రేమకు అంగీకరించాడు. కానీ శ్రీనివాసుడు పేదవాడు కాబట్టి సంపదల దేవుడైన కుబేరుని ప్రార్థించాడు. దీంతో కుబేరుడు అప్పుగా డబ్బు నగలు ఇచ్చాడు శ్రీనివాసుడికి అప్పుడు శ్రీనివాసుడు ఈ అప్పును నా భక్తుల కానుకలతో తీరుస్తాను అని చెప్తాడు. అలా శ్రీనివాసుడు పద్మావతి వివాహం వైభవంగా జరిగింది. వివాహం తర్వాత లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసి ఆమె తిరుమలకు వచ్చేసింది. శ్రీనివాసుడు లక్ష్మీదేవి పద్మావతి మధ్య గొడవ జరిగింది. ఆ గందరగోళంలో శ్రీనివాసుడు శిలగా మారిపోయాడు. అప్పుడు బ్రహ్మ శివులు ప్రత్యక్షమై కలియుగంలో మానవజాతి కష్టాల నుంచి విముక్తి కోసం శ్రీనివాసుడు ఏడుకొండలపై ఉండాలని కోరారు. లక్ష్మీదేవి పద్మావతి కూడా శ్రీనివాసుడితో శిలలుగా మారిపోయారు. ఈ విగ్రహాలనే మొదట కనుగొన్నది వైకానస అర్చకుడు అయినటువంటి గోపీనాథ దీక్షితులు ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కలియుగ దైవంగా భక్తులని కాపాడుతూ ఉన్నాడు. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి.

Read more

ముఖ్య వార్తలు


తాడిపత్రి శ్రీ రామ నవమి మహోత్సవం: పట్టాభిషేకం సందడి, భక్తికి నూతన ఉత్సాహం

March 30, 2026

ఈ ఏడాది శ్రీ రామ నవమి పండుగ తాడిపత్రిలో కూడా హృదయపూర్వకంగా జరుపుకుంటున్నారు. శ్రీ రామ నవమి అనేది ప్రభువులు శ్రీరామచంద్రుని జన్మద...

View Post

కొండగట్టులో భక్తుల భారీ రద్దీ: ఆంజనేయ స్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా మారిన సందడి

March 30, 2026

 తెలంగాణ జాగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఆలయం వద్ద ఈ సమయంలో భక్తుల భారీ రద్దీ కనిపిస్తోంది. ఇక్కడి ఆ...

View Post

తిరుమల అన్నప్రసాదం: రికార్డ్‑స్థాయిలో సేవలు — భక్తుల ఆనందానికి ప్రతీక

March 30, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) అన్నప్రసాదం కార్యక్రమం ఎంతో సక్రమంగా, విస్తృతంగా నిర్వహిస్తున్నంటూ తాజా సమాచారం అందుతోంది. తిరుమ...

View Post

తిరుమలలో వేంకటేశ్వర ప్రాణాదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం

March 28, 2026

 తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవా కార్యక్రమాలకు మరోసారి భక్తుల ఉదారత చాటుకుంది. శ్రీ వేంకటేశ్వర ప్రాణాదాన ట్రస్టుకు ఒ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 54382